జైల్లో చంద్రబాబు స్టోరి... ప్రమాణం చేయించిన బాలయ్య
on Oct 22, 2024
అన్స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇక అయన మాటలతో ఆడియన్స్ ని ఏడిపించేసారు. అలాగే ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లే సందర్భం ఎప్పుడూ మర్చిపోను అని చేప్పారు. అలాగే సమయస్ఫూర్తితో ఆయన సమాధానాలు ఇచ్చారు. "నేను బస్సులో ఉన్నాను మిమ్మల్ని అరెస్ట్ చేసాం అన్నారు. రాత్రంతా తలుపు కొడితే తలుపు కూడా తియ్యలేదు. "మొదటి రాత్రి జైల్లో ఎలా గడిచింది" అని " బాలయ్య అడిగేసరికి "చావును గురించి ఆలోచించలేదు..ఆ 53 రోజులు కూడా అవే జరిగాయి..కానీ తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను " అని చెప్పారు చంద్రబాబు.
ఇక బాబు బాలయ్య గురించి పొగిడేశారు "బాలయ్య ఎక్కడుంటే అక్కడ జోక్స్ ఉంటాయి." అన్నారు. ఇక చంద్రబాబు తనకు ఎప్పుడూ విరాట్ కోహ్లీ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు. " మా చెల్లి భువనేశ్వరి, నా కూతురు బ్రహ్మణి..ఇంట్లో ఎవరు బాస్" అని బాలయ్య అడిగేసరికి "మాకు ఇంట్లో ఇదొక పెద్ద సమస్య ఐపోయింది" అన్నారు చంద్రబాబు. సీఎం ఐనా, పిఎం ఐనా ఇంట్లో అత్తా కోడళ్ల పోరు కామన్ అనే విషయం దీన్ని బట్టి తెలుస్తోంది. ఇలా ఈ టాక్ షోలో ఇంకా ఇంటరెస్టింగ్ విషయాలు ప్రసారం కాబోతున్నాయి.